Husband explains GST to his wife - in most funniest way!


భార్య: ఏవండి.. ఏ టీవీ లో చూసినా, పేపర్ లో చూసినా GST ..GST అంటున్నారు. GST అంటే ఏంటండి? 

భర్త: అబ్బా... నీ బుర్ర కి అది అర్థం చేస్కొనే అంత కెపాసిటీ లేదు లే కానీ. వెళ్లి టీ పట్రా..

భార్య: మీరు చెప్తే కానీ నేను టీ పెట్టను. 

భర్త: సరే, నీ కోసం GST ని సింపుల్ గా చెప్తా విను. 

భార్య: హా..సరే చెప్పండి.

భర్త: నాకు పెళ్లి కాకముందు ఇంటికి తాగి వెళ్లాను అనుకో..మొదట మా అక్క వచ్చి ఏంట్రా ఇలా చేసావు అని సంజాయిషీ అడ్గుతుంది. ఆ తర్వాత మా అమ్మ వచ్చి నాలుగు తిట్లు తిడ్తుంది. తర్వాత మా నాన్న గారికి కూడా సంజాయిషీ ఇవాల్సి వస్తుంది. కరెక్ట్ ఆ ?? 

భార్య: హా.. అంతే కదా. 

భర్త: ఇది ఇంతకు ముందు ఉన్న టాక్స్ విధానం. ఏదైనా బిజినెస్ చేయాలి అంటే మొదట సెంట్రల్ లో టాక్స్ కట్టాలి . తర్వాత స్టేట్ లెవెల్ ఆ తర్వాత అవసరమైతే లోకల్ మున్సిపోలిటి. 

భార్య: మరి ఈ GST ఏంటి? 

భర్త: అంటే ఇది పెళ్లి తర్వాత లాంటిది. ఇంటికి తాగేసి వచ్చా అనుకో. నీకు ఒక్కతికే సమాధానం చెప్తే చాలు. మునుపటి లాగా అంతమందికి చెప్పకర్లేదు. అదే విధం గా టాక్స్ కూడా ఒకేచోట కడితే చాలు. అన్ని చోట్ల అవసరం లేదు. 

భార్య: ఏది అడిగిన చివరికి నా మీదకే వస్తారు. పొండి. టీ లేదు చింతకాయ్ లేదు. 

భర్త: వీళ్ళతో చెప్తే ఒక బాధ చెప్పకపోతే ఇంకో బాధ.

source: Quora

share and spread the fun!!
if you wish publish your writings, send mail to samosatimes@outlook.com

Comments