మై డియర్ పెళ్ళాం,
నేను ఎన్నో మిస్టేక్స్ చేసుండచ్చు. అవన్నీ కేవలం
నాకు తెలియనితనం వల్లనే. ఈ మాత్రానికే నా మీద అలిగి పుట్టింటికి వెళ్లిపోవాల?
పొరపాటున కాఫీ బాగాలేదు అని చెప్పాను. అరే, మా
ఆయనకి ఇంకా టేస్ట్ తెసుకోవడం రాలేదు అని అనుకోవచు కదా. మంచి కాఫీ అలానే ఉంటుంది
అని చెప్పచ్చు కదా. ఆ మాత్రానికే బుంగమూతి పెట్టుకుంటే ఎలా?
ఇంటికి లేట్ గా వస్తే అది ఇంటికి రావడం ఇష్టం లేక
అని ఎందుకు అనుకోవడం. మా అయన ఆఫీస్ లో కష్టపడుతున్నాడు అనుకొని క్షమించచ్చు కదసే
రాక్షసి.
పక్కింటి పప్పు బాగుందని చెప్పినంత మాత్రాన నువ్
చేసిన పప్పు బాగాలేదని కాదు కదా బంగారం. అర్థం చేస్కో.
నిన్ను వీకెండ్స్ లో సినిమా కి తీస్కేల్లకపోతే నీ
మీద ప్రేమ లేనట్టు కాదు. GST అని నీకు మించిన రాక్షసి ఒకటి ఉంది లే. అలా అని అది
నీకు అక్కో చెల్లో అవుతుంది అనుకోని నాకు విడాకుల నోటీసు గట్రా పంపేవు. అది
గవర్నమెంటు పెట్టిన కొత్త టాక్స్ బిల్.
ఫోన్ లో ఎక్కువసేపు మాట్లాడుతుంటే అది నా గర్ల్
ఫ్రెండ్ కాదు. ఇంటికి వచ్చాక కూడా ఆఫీసు మీటింగ్స్ అటెండ్ అవ్వాల్సి వస్తోంది. నా
మొహానికి నువ్ పడడమే ఎక్కువ. మళ్ళీ ఇంకోటా. సారీ.. సారీ...
మొన్నప్పుడో నిన్ను తిట్టాను అని రెండు రోజులు
నాకు ఫుడ్ పెట్టలేదు. నువ్ మాత్రమే వండుకుని తిన్నావ్. ఆ రెండు రోజులు బయట మంచి రెస్టారెంట్
లో తిన్నాను. అదే నువ్ నా మిద అలగకపోతే ఇద్దరం హ్యాపీ గా కలిసి వెళ్ళేవాళ్ళం.
నెక్స్ట్ టైం నాకు పనిష్మెంట్ ఇచ్చేముందు గుర్తుపెట్టుకో. అలా అని పనిష్మెంట్
వేరేలా ఇచ్చేవు. ప్రతిదీ బయట దొరకదు కదా.
"ఈ మద్య నన్ను పొగడట్లేదు, నీకు ఇంట్రెస్ట్
పోయింది" అన్నావ్. నిన్ను పొగడట్లేదు అంటే ఇంట్రెస్ట్ పోయినట్టు కాదు బంగారం. ఎదో
వేరే పనుల్లో కొంచెం బిజీ అంతే. నువ్ తిరిగి వచ్చేయ్. గంటలో అరవై నిమిషాలు నిన్ను
పొగుడుతా.
ఇలా నన్ను అర్థం చేస్కుటావని భావిస్తూ నాలుగు
కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాను. అదే, నేను నా కళ్ళజోడు. ఇంకెవరో అనుకోనేవు. త్వరగా
వచ్చేయ్.
if you wish to write articles in SamosaTimes, send a mail to samosatimes@outlook.com
Comments