<Episode 1> <Episode 2> <Episode 3> <Episode 4> <Episode 5> <Episode 6> <Episode 7>
Episode 4:
కొన్ని విషయాలు తెలుసుకోవాలనే కుతూహలం ఏదైతే ఉందో, అది మనకు 'ఇంకా తెలియదు' అనే బాధ కన్నా 'ఒకవేళ తెలిస్తే ఏమై ఉండచ్చు' అనే ఉత్సాహాన్ని.. ఊహని..కలిగిస్తుంది. అలాంటి ఊహాగానాల్లో నాకు కొన్ని పేర్లు తోచాయి. అందులో కొన్ని పేర్లు ఆనంద్ (ఓ మంచి కాఫీ లాంటి అబ్బాయి)?? అరవింద్?? అరుణ్ (చాలా normal పేరు), మహేష్ ( ఈ పేరు లో వైబ్రేషన్స్ ఉంటాయి)?? పవన్ (powerful)?? రామ్ (ఒక మంచి బాలుడు)?? రాహుల్(నామ్ తో సునాహి హోగా)?. ఇలా ఊహల్లో తేలుతున్న టైంలో నా ఫ్రెండ్ ఫోన్ లో మోగిన ringtone జర్నీ సినిమా లో పాట "నీ పేరే తెలియదు గా, నిను పిలువగా లేను కదా" అంటూ నన్ను తట్టి లేపింది. నాకున్న ఒక అలవాటు ఏంటంటే, చుట్టు పక్కల ఎవరు ఏమనుకున్నా సరే, పాట పాడుకుంటూ మైండ్ ని రిఫ్రెష్ చేస్కోవడం. నేను ఆనందంగా ఉండడం ఇష్టం లేదేమో, నా colleagues మొదలు పెట్టారు "పేరు తెలుసుకోవాలి అని ఇంత ఆరాట పడుతున్నావ్, పేరు తెలిస్తే ఏం చేస్తావ్ చెప్పు.. మాట్లాడతావా?? నీకు అంత ధైర్యం ఉందా??..లేదు", "అయినా పేరు తెలిసిపోతే, ఇప్పుడు నిరీక్షణ లో ఉన్న interest తెలిసాక ఉండదు" అని ఎవరి అభిప్రాయాలు వారు చెప్తూ వచ్చారు. వాళ్ళు చెప్పేవి ఒక చెవిలో వెళ్లి ఇంకో చెవి నుంచి బయటికి వెళ్తున్నాయ్. కానీ నా బుర్ర లో ఈ పాట, మనసులో ఆ అబ్బాయి. ఇంకేం వినబడట్లేదు. ఏదో తెలీని నమ్మకం, sixth సెన్సో seventh సెన్సో అంటారు కదా.. అదే. పేరు తెలుస్తుంది అనే గట్టి నమ్మకం.దేవుడా!! ప్లీజ్ ఒక్కసారి పేరు తెలిసేలా చెయ్ చాలు. ఎన్ని ప్లాన్లు వేసినా, అన్ని ఫెయిల్ అయ్యాయి. మరి తెలుసుకోవడం ఎలా అని ఆలోచిస్తూ నడుస్తూ ఉన్నా, నేను నడిచే దారిలో ఎవరిదో ID కార్డ్ పడి ఉంది. వెళ్లి తీసుకొని చూసా, అంతే, నోట మాట రాలేదు. చేతులు కాళ్ళు కదలట్లేదు. చుట్టూ ఏం జరుగుతుందో మర్చిపోయా. చూస్తే అందులో ఆ అబ్బాయి ఫోటో. (Damnnnnn...) నాకు ఆ అబ్బాయి పేరు తెలిసిపోయింది. నాకు తెలిసిపోయిందోచ్....
ఇన్ని రోజులు ఎంత ప్రయత్నించినా తెలీని పేరు ఇంత easy గా తెలిసిపోతుంది అని కల్లో కూడా అనుకోలేదు. కార్డ్ మీద పేరు "Bishwas" అని ఉంది. ఎన్ని పేర్లు అనుకున్నానో, చివరికి ఇదా అతడి పేరు. కానీ ఆ పేరు నాకు అంత నచ్చలేదు. కాదు కాదు.. అతడికి ఆ పేరు set అవ్వలేదు అని అనిపించింది. సరే ఇక మన హీరో గారి పేరు సంగతి పక్కన పెడితే, ఈ కార్డ్ తనకి ఎలా రిటర్న్ చేయాలి?? నేరుగా నేనే వెళ్లి ఇస్తే బాగుంటదా?? అని ఆలోచించా. చివరికి గేట్ దగ్గర ఉన్న సెక్యురిటి కి ఇచ్చేస్తే, వాళ్లే ఇచ్చేస్తారు అనుకొని, ఫుల్ నేమ్ ఇంకోసారి చూసుకొని, సెక్యురిటి గార్డ్స్ చేతిలో ID కార్డ్ పెట్టి నా డెస్క్ దగ్గరకు వెళ్లిపోయా.
పేరు తెలిసిన ఆనందంలో, ఇక ఆఫీస్ communicator లో తన పేరు search చేయగానే, అతడి mail ID, పని చేసే ప్రాజెక్ట్, తన ఫోన్ నెంబర్, ఇంకా చాలా details వచ్చేసాయి. ఇక నా ఆనందానికి అడ్డు లేకుండా పోయింది. ఇన్ని వారాలు ఎవరి పేరు తెలుసుకోవాలని ఆరాట పడ్డానో, అది ఇంత సులువుగా నెరవేరుతుంది అని అనుకోలేదు. నిజానికి పేరు అంతగా నచ్చలేదు. అప్పుడు ఒక quotation గుర్తు కి వచ్చింది. "More the expectations, more the disappointment". మనం ఎంత ఊహించుకుంటామో, అది మన ఊహ కి దగ్గరగా లేకపోతే అంత బాధ పడతాం. అయినా పేరు లో ఏముంది చెప్పండి, మనకు మనిషి నచ్చితే తర్వాత అన్ని నచ్చుతాయి. మరి నేను ఇంత ఆనందం లో ఉంటే మీకు కథ ఎలా చెప్పేది?? రేపు మాట్లాడుకుందాం. అదేంటి నిన్న బాధలో ఉన్నావ్, కథ చెప్పలేను అన్నావ్, ఇవ్వాళ సంతోషం లో ఉన్నావ్, అయినా చెప్పలేను అంటున్నావు.. ఏంటిది?? నిజమే, నేను నిన్న చెప్పినట్టు, ఈ చిన్ని గుండె కి emotions ఏ కానీ logics ఉండవు. మనిషికి అతిగా ఆనందం వచ్చినా, అతిగా బాధ వచ్చినా తట్టుకోలేడు.
( అందుకే, తరువాయి భాగం రేపు @6PM)
Comments